కొండగట్టు అంజన్న సన్నిధిలో భక్తుల సందడి

కొండగట్టు అంజన్న సన్నిధిలో భక్తుల సందడి

కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న సన్నిధిలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజామునుంచే క్యూలైన్లలో బారులు తీరి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 15 వేల మందిపైగా భక్తులు అంజన్నను దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. పలు రకాల టికెట్ల అమ్మకం ద్వారా రూ. 6,21 లక్షల ఆదాయం వచ్చిందని చెప్పారు. 

భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సూపరింటెండెంట్ హరిహర నాథ్, ఇన్ స్పెక్టర్ అశోక్ ఏర్పాట్లు చేశారు. గుట్టపైన స్వయంభూగా వెలసిన శ్రీరామ పాదుకల రామాలయం ఉంది. ఇక్కడ నిత్యపూజలు లేక నిరాదరణకు గురైంది. గుడి మూసి ఉండడంతో దర్శించుకునే పరిస్థితి లేక భక్తులు అసహనం వ్యక్తం చేస్తూ నిరాశతో తిరిగి వెళ్లారు.