వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్నఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. ధర్మగుండంలో పవిత్ర స్నానం ఆచరించి.. క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు.
అనంతరం స్వామి వారి రుద్రాభిషేకం పూజలో పాల్గొన్నారు. ఇష్టమైనా కోడె మొక్కు చెల్లించుకున్నారు.