యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. 2023 జులై 02 ఆదివారం సెలవురోజు కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుంటున్నారు. స్వామివారి దర్శనానికి భక్తులు క్యూలైన్ లో వేచి ఉన్నారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలతోపాటు అభిషేకాలు నిర్వహించారు.
ఉచిత దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కొండపైన ఉన్న కల్యాణ కట్ట, ప్రసాదాల కౌంటర్లు, పుష్కరిణి వద్ద భక్తుల కోలాహలం కొనసాగుతున్నది.