
మల్లికార్జునస్వామిని దర్శించుకోవడానికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. శివశక్తులు బోనాలు ఎత్తుకొని గంగిరేగి చెట్టు వద్ద స్వామికి సమర్పించి, పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులు రేణుక ఎల్లమ్మకు బోనాలు సమర్పించారు. అభిషేకాలు చేసి, ఒడిబియ్యం పోసి కోడేలు కట్టి మొక్కులు చెల్లించుకొని అనంతరం క్యూలైన్లో వెళ్లి స్వామిని దర్శించుకున్నారు.
- కొమురవెల్లి, వెలుగు