పెద్దమ్మతల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు

పాల్వంచ రూరల్, వెలుగు : పాల్వంచ మండల పరిధిలోని కేపీ జగన్నాధపురంలో కొలువుతీరిన పెద్దమ్మతల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవురోజు కావడంతో భక్తులు ఉమ్మడి జిల్లాలనుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు.

ఆలయ ప్రాంగణంలో అన్నప్రాసను, వాహనపూజలు, తలనీలాలు, అమ్మవారికి ఒడిబియ్యం, తదితర మొక్కులు చెల్లించుకున్నారు. కొత్తగూడెం జిల్లా జుడీషియల్​ ఫస్ట్​క్లాస్​ మేజిస్ట్రేట్​ కె సాయిశ్రీ, పాల్వంచ తహసీల్దార్​ నాగరాజు పెద్దమ్మతల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎ.రజినికుమారి, గుడి చైర్మన్​ మహిపతి రామలింగం, ధర్మకర్తలు, భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు.