యాదాద్రిలో భక్తుల రద్దీ..ఉచిత దర్శనానికి 2 గంటల సమయం

యాదాద్రి భువనగిరి జిల్లా :- ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది. 2024 మే 26న ఆదివారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచి క్యూ కాంప్లెక్స్ లోకి భక్తులను ఆలయ అధికారులు అనుమతించారు. స్వామివారి ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతుందని..ప్రత్యేక ప్రవేశ 150 రూపాయల దర్శనానికి 2 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇకపోతే ఆలయానికి శనివారం రూ.62,55,860 ఆదాయం సమకూరింది. ప్రసాద విక్రయం ద్వారా రూ.19,15,350, వీఐపీ టికెట్లతో రూ.16.20 లక్షలు, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.9 లక్షల ఆదాయం వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.