కొండగట్టులో భక్తుల రద్దీ

కొండగట్టు, వెలుగు: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధిలో మంగళశారం భక్తుల రద్దీనెలకొంది. అంజన్నకు ఇష్టమైన రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

సుమారు 20వేల మంది వరకు భక్తులు స్వామిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా నేడు కొండగట్టు హుండీ లెక్కింపు చేపట్టనున్నట్లు ఆలయ ఈఓ వెంకటేశ్‌‌ తెలిపారు.