
గజ్వేల్(వర్గల్), వెలుగు: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారంగుట్ట(నాచగిరి) లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఆలయ కోనేరు, హల్దీవాగుల్లో పుణ్యస్నానాలు ఆచరించి సత్యనారాయణస్వామి వ్రతాలు చేశారు. అనంతరం ప్రధానాలయంలో స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అర్చకులు అమ్మవారి సమేతుడైన స్వామివారికి విశేష అభిషేకాలు, పుష్పాలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో అన్నపూర్ణ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.