
గజ్వేల్, వెలుగు: ఉమ్మడి జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాలుగా పేరుగాంచిన వర్గల్ సరస్వతి అమ్మవారి, నాచారంగుట్ట లక్ష్మీనర్సింహ్మ స్వామి ఆలయాలకు సోమవారం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని భక్తులు పోటెత్తారు. కొత్త సంవత్సరాన్ని దైవ దర్శనంతో ప్రారంభిస్తే మంచి జరుగుతున్న నమ్మకంతో ప్రజలంతా ఆలయాల బాటపట్టారు.
ఈ సందర్భంగా నాచగిరి, విద్యాధరిలో ఉదయం నుంచి భక్తులు తరలివచ్చి దర్శనం కోసం బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. నాచగిరిలో ధనుర్మాసం ప్రత్యేక పూజలు కొనసాగాయి. ఆలయాల నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.