ఆలయాల్లో భక్తుల కిటకిట

ఆలయాల్లో భక్తుల కిటకిట

శ్రావణమాసం తొలి శుక్రవారం, నాగుల పంచమిని పురస్కరించుకొని ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలోని ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి పుట్టలో పాలు పోయడానికి మహిళలు ఆలయాలకు క్యూ కట్టారు.  వరలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. -నెట్​వర్క్​, వెలుగు