తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 15గంటల సమయం 

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లె్క్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. నారాయణ గిరి షెడ్లవరకు అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. స్వామివారిని నిన్న 72వేల 294 మంది భక్తులు దర్శించుకున్నారు. 31వేల 855 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 3.39 కోట్లు వచ్చింది అధికారులు వెల్లడించారు. 
మరోవైపు ఇవాళ (జూన్ 22) పలు సేవలు రద్దు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో మలయప్పస్వామికి ఏటా జ్యేష్ట మాసంలో జ్యేష్ట నక్షత్రానికి ముగిసేలా మూడు రోజుల పాటు జ్యేష్టాభిషేకాలు నిర్వహిస్తున్నారు. జూన్ 19 నుంచి జూన్ 22 వరకు మూడు రోజుల పాటు ఈ అభిషేకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పలు సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు  తెలిపారు.