యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో యాదాద్రీశ్వరుడిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో క్యూలైన్లు అన్ని భక్తులతో నిండిపోయాయి. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం. స్పెషల్ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూస్తున్నారు.
మరోవైపు జూలై 15 లోపు యాదగిరిగుట్టలో యాదరుషి మండపాన్ని నిర్మించనున్నట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు. శనివారం సంబంధిత ఆఫీసర్లతో కలిసి యాదరుషి మండపాన్ని నిర్మించే స్థలాన్ని ఈవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదగిరి నారసింహుడి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రంలోపు(జూలై 15న స్వాతినక్షత్రం) భక్తులు గిరిప్రదక్షిణ చేసే మార్గంలో యాదరుషి మండపాన్ని నిర్మించి భక్తులకు అందుబాటులో తెస్తామన్నారు.