యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ .. ఉచిత దర్శనానికి 2 గంటలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నారసింహాస్వామిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉచిత దర్శనానికి 2 గంటల  సమయం పడుతోంది.  ప్రత్యేక ప్రవేశ 150 రూపాయల దర్శానానికి సుమారుగంట సమయం పడుతుంది. భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇంబ్బంది కలుగకుండా చూస్తున్నారు. కాగా జూన్ 1 నుండి కొండపైన ప్లాస్టిక్ నిషేధంపై ఆలయ ఈవో చర్యలు  చేపట్టనున్నారు.  

మరోవైపు యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహుడి జయంతి ఉత్సవాల సందర్భంగా రద్దు చేసిన ఆర్జిత సేవలను  పునరుద్ధరించారు. ఈ నెల 20 ప్రారంభమైన ఉత్సవాలు 22న ముగియడంతో స్వామివారి నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణం,  బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం వంటి ఆర్జిత సేవలను గురువారం నుంచి ప్రారంభించారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేశారు. గురువారం భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆలయానికి రూ.49,11,903 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు.