![Long Weekend Effect: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 24గంటలు..](https://static.v6velugu.com/uploads/2024/08/crowd-of-devotees-increased-in-tirumala-24-hours-for-darshan_jRe4rIocuU.jpg)
స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా లాంగ్ వీకెండ్ కలిసి రావటంతో ఫ్యామిలీస్ తో కలిసి ట్రిప్స్ ప్లాన్ చేశారు చాలా మంది. ఈ క్రమంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా,శిలాతోరణం వరకు భక్తుల క్యూలైన్లలో వేచి ఉన్నారు.
ఇదిలా ఉండగా శుక్రవారం ( ఆగస్టు 16,2024 ) 62,625 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.63 కోట్లు వచ్చిందని తెలుస్తోంది. భక్తుల రద్దీ పెరిగిన దృష్ట్యా ఈ రెండు, మూడురోజులు తిరుమల వెళ్లాలని ప్లాన్ చేసుకునేవారు రద్దీకి అనుగుణంగా ప్లాన్ చేసుకోవటం మంచిది.