యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ.. ఉచిత దర్శనానికి 3 గంటలు

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం(నవంబర్ 05) సెలవుదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నరసింహ స్వామిని దర్శించుకోవడానికి బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. 

ఈ క్రమంలో ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా, స్పెషల్ దర్శనానికి 2 సమయం పడుతోంది. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. 

Also Read :- 14 మందితో సీపీఎం ఫస్ట్ లిస్ట్

లడ్డు ప్రసాదం కౌంటర్లు, నిత్యా కల్యాణం, కొండ కింద కల్యాణ కట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడితో ఆహ్లాద వాతావరణం నెలకొంది. భక్తులకి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేసినట్లుగా ఆలయ అధికారులు వెల్లడించారు.