కొండగట్టు,వెలుగు : కొండగట్టు అంజన్న ఆలయానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామునుంచే స్వామి వారి దర్శనానికి బారులు తీరారు. సమ్మక్క సారక్క జాతరకు వెళ్లే భక్తులు ముందుగా కొండగట్టు అంజన్న స్వామి దర్శనం చేసుకుంటారు. ఈ క్రమంలో మంగళవారం ఇరవై వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. బొజ్జ పోతన్న వైపు, ఘాట్ రోడ్డులో భక్తుల వాహనాలతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఇబ్బందుల మధ్య భక్తులు స్వామి వారి దర్శనానికి క్యూ కట్టారు. ఐరన్ మెట్లు వల్ల ఎండ వేడికి మహిళలు ఇబ్బంది పడ్డారు. క్యూ లైన్లలో కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేకపోవడంతో భక్తులు ఆగ్రహించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ బుద్ది శ్రీనావాస్, సునీల్ పాల్గొన్నారు.