కిక్కిరిసిన వేములవాడ ..దర్శనానికి 4 గంటల సమయం

వేములవాడ, వెలుగు :  ప్రసిద్ద పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు కిక్కిరిసిపోయారు.  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పట్టింది. భక్తులు కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించారు.  పవిత్ర ధర్మగుండంలో స్నానం ఆచరించి తడి బట్టలతోనే క్యూలెన్​ ద్వారా  శ్రీ లక్ష్మీగణపతి స్వామిని, శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కోరిన కోర్కెలు తీరాలని కుటుంబ సభ్యులతో కలిసి కోడె మొక్కులు చెల్లించారు. ప్రసాదం కౌంటర్లు భక్తులతో నిండిపోయాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అలయ అధికారులు పర్యవేక్షించారు. అనుబంధ ఆలయం భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. 

రాజన్నను దర్శించుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే 

సుల్తానాబాద్, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామికి అభిషేకం చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.