
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులకు ప్రమోషన్లు , అప్గ్రేడెషన్ కోసం సోమవారం స్థానిక డీఈఓ ఆఫీస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించారు. సీనియార్టీ జాబితా ప్రకారం సోమవారం లాంగ్వేజ్ పండిట్ , పీఈటీ సర్టిఫికెట్ల పరిశీలన జరిగింది. దీంతో జిల్లాలోని టీచర్లు డీఈఓ ఆఫీస్కు వచ్చారు. ఆఫీస్ టీచర్లతో కిటకిట లాడింది. ఎన్నో రోజులుగా ఉన్న పెండింగ్ ఉన్న సమస్యలను వారి ట్రాన్స్ఫర్లకు అభ్యంతరాలను స్వీకరించారు. కాగా సోమవారం , మంగళవారం లాంగ్వేజ్ పండిత్ , పీఈటీల సర్టిఫికేట్ వెరిఫికేషన్ల కోసం కేటాయించారు. -ఫొటోగ్రాఫర్ నిజామాబాద్, వెలుగు