మెదక్లో చికెన్​ మేళాకు ఎగబడ్డ జనం

మెదక్లో చికెన్​ మేళాకు ఎగబడ్డ జనం

బర్డ్  ఫ్లూ ప్రచారం జరుగుతుండడంతో చికెన్, కోడిగుడ్డు అమ్మకాలు పడిపోయాయి. ఈ నేపథ్యంలో మెదక్  పట్టణం ఆటోనగర్​లోని ఓ చికెన్  సెంటర్ నిర్వాహకుడు శుక్రవారం చికెన్, ఎగ్​ మేళా నిర్వహించాడు. ఇందులో భాగంగా చికెన్, కోడిగుడ్డుతో వివిధ రకాల వంటకాలు తయారు చేసి ఫ్రీగా పంపిణీ చేశాడు.

విషయం తెలుసుకున్న ప్రజలు వాటిని తినేందుకు ఎగబడ్డారు. చికెన్, గుడ్డు తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదనే విషయం ప్రజలకు తెలియజేసేందుకే ఈ మేళా ఏర్పాటు చేసినట్లు చికెన్ సెంటర్ నిర్వాహకుడు తెలిపారు.‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

- మెదక్​టౌన్, వెలుగు