ప్రపంచ వ్యాప్తంగా జూలైలో సాఫ్ట్ వేర్ అప్డేడ్ సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే.. దంతో సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్ స్ట్రైక్ పై నష్టపరిహారం కోరుతూ అనేక కంపెనీలు, వ్యాపార సంస్థలు చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు.
ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ డెల్లా.. క్రౌడ్ స్ట్రైక్ సైబర్ సెక్యూరిటీ సంస్థలపై 500 మిలియన్ల డాలర్ల నష్టపరిహారం కోరుతూ కోర్టుకెక్కింది. క్రౌడ్ స్ట్రైక్ నిర్లక్ష్యం, ఉద్దేశ పూర్వక దుష్ప్రవర్తన కారణంగానే తమ సంస్థ నష్టపోయిందని తెలిపింది. ఎంటర్ ప్రైజెస్ సాఫ్ట్ వేర్ ఒప్పందాలలో చేర్చబడిన నష్టాలపై కాంట్రాక్టు పరిమితు లను రద్దు చేసుకుంది.
షేర్ హోల్డర్లు కూడా క్రౌడ్ స్ట్రైక్ పై క్లాస్ యాక్షన్ దావా వేసి చట్టపరమైన చర్య కూడా తీసుకున్నారు. క్రౌడ్ స్ట్రైక్ పారదర్శకత, రిస్క్ మేనేజ్ మెంట్ విధానాల గురించి అనేక ప్రశ్నలు లేవనెత్తాయి. సాఫ్ట్ వేర్ అప్ డేట్ విధానాలకు సంబంధించిన కంపెనీ తమను తప్పుదారి పట్టించిందని షేర్ హోల్డర్లు తెలిపారు.