‘రక్షిత’.. బైక్​లే అంబులెన్స్‌‌లు

‘రక్షిత’.. బైక్​లే అంబులెన్స్‌‌లు
మారుమూల అటవీ ప్రాంతాలు, నక్సల్స్‌‌ ప్రభావిత ప్రాంతాల్లో ఎమర్జెన్సీ పరిస్థితుల్లో  ఉపయోగించేందుకు 21 బైక్‌‌ అంబులెన్స్‌‌లను డీఆర్‌‌‌‌డీవో తయారు చేసింది. ‘రక్షిత’ పేరుతో రూపొందించిన 350 సీసీ రాయల్‌‌ ఎన్‌‌ఫీల్డ్‌‌  బైక్‌‌లను సీఆర్‌‌‌‌పీఎఫ్‌‌కు అందించింది. మారుమూల ప్రాంతాల్లో దాడులు జరిగి గాయపడిన వారిని  హాస్పిటల్‌‌కు తరలించడంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వీటిని తయారు చేశారు. ప్రజల కోసం కూడా వీటిని వినియోగిస్తామని సీఆర్‌‌‌‌పీఎఫ్‌‌ చీఫ్‌‌ మహేశ్వరి చెప్పారు. ఈ బైక్‌‌ అంబులెన్స్‌‌లో వైటల్‌‌ పారామీటర్స్‌‌ కొలిచేందుకు వీలుగా ఫిజియోలాజికల్‌‌ పారామీటర్‌‌‌‌ మెజరింగ్‌‌ ఎక్విప్‌‌మెంట్‌‌, దాన్ని మానిటర్‌‌‌‌ చేసేందుకు ఎల్‌‌సీడీ డ్యాష్‌‌ బోర్డ్‌‌, ఆటో వార్నింగ్‌‌ సిస్టమ్‌‌ను అమర్చారు. ఎయిర్‌‌‌‌స్ల్పింట్‌‌ ఆక్సిజన్‌‌ కిట్‌‌, సెలైన్‌‌ పెట్టేందుకు, ఆక్సిజన్‌‌ పెట్టే విధంగా ఫుట్‌‌ రెస్ట్‌‌ దగ్గర ఏర్పాట్లు చేశారు.