సర్వీస్‌‌‌‌ రివాల్వర్‌‌‌‌తో కాల్చుకొని CRPF జవాన్ సూసైడ్‌

సర్వీస్‌‌‌‌ రివాల్వర్‌‌‌‌తో కాల్చుకొని CRPF జవాన్ సూసైడ్‌

భద్రాచలం, వెలుగు: సీఆర్పీఎఫ్‌‌‌‌ జవాన్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ రివాల్వర్‌‌‌‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లా గాందీరాజ్‌‌‌‌ పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌లోని 226 బెటాలియన్‌‌‌‌ బేస్‌‌‌‌ క్యాంప్‌‌‌‌లో శనివారం జరిగింది. అస్సాంకు చెందిన విపుల్‌‌‌‌ బియాన్‌‌‌‌ (36) సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్‌‌‌‌ జవాన్‌‌‌‌గా పనిచేస్తున్నాడు. సెలవులపై అస్సాంకు వెళ్లిన బియాన్‌‌‌‌ రెండు రోజుల క్రితమే తిరిగి డ్యూటీలో చేరాడు. శనివారం టాయిలెట్‌‌‌‌లోకి వెళ్లి సర్వీస్‌‌‌‌ రివాల్వర్‌‌‌‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన మిగతా జవాన్లు విపుల్‌‌‌‌ బియాన్‌‌‌‌ డెడ్‌‌‌‌బాడీని గాదిరాజ్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. జవాన్‌‌‌‌ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని ఆఫీసర్లు తెలిపారు.