గుండెపోటుతో సీఆర్​పీఎఫ్​ జవాన్​ మృతి

గుండెపోటుతో సీఆర్​పీఎఫ్​ జవాన్​ మృతి
  • వరంగల్ జిల్లాలోని కోమటిపల్లి తండా వాసి

నర్సంపేట/గూడూరు, వెలుగు: గుండెపోటుతో  సీఆర్పీఎఫ్​జవాన్ చనిపోయాడు. వరంగల్​జిల్లా ఖానాపురం మండలం కోమటి పల్లితండాకు చెందిన గుగులోతు రమేశ్ నాయక్ (38) ​సీఆర్పీఎఫ్​జవాన్. చత్తీస్​గఢ్​లో విధులు నిర్వహిస్తుండగా డ్యూటీలో భాగంగా  శుక్రవారం గుండెపోటుతో మృతిచెందాడు.  రమేశ్​డెడ్ బాడీని సొంతూరుకు చేరుకోగా స్థానికులు నివాళులర్పించారు. కొవ్వొత్తులతో ర్యాలీ తీశారు. రమేశ్ అంత్యక్రియలను శనివారం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.