రాష్ట్రపతి పాలన విధించిన కొద్దిసేపటికే దారుణం..మణిపూర్‌లో జవాన్లపై కాల్పులు

రాష్ట్రపతి పాలన విధించిన కొద్దిసేపటికే దారుణం..మణిపూర్‌లో జవాన్లపై కాల్పులు

రాష్ట్రపతి పాలన విధించిన కొన్ని గంటల్లోనే  మణిపూర్ లో దారుణం జరిగింది.ఆర్మీ క్యాంపులో ఓ జవాన్ తోటి జవాన్లపై కాల్పులు జరిపి తాను కాల్చుకున్నాడు.. దీంతో మొత్తం ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఏడుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాల్లోని లాంఫెల్ లోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్ పీఎఫ్) శిబిరంగా గురువారం రాత్రి 8.30గంటలకు ఈ ఘటన జరిగింది. 

120వ బెటాలియన్ కు చెందిన హవల్దార్ సంజయ్ కుమార్ తన సర్వీస్ వెపన్ తో కాల్పులు జరిపి ఓ కానిస్టేబుల్, సబ్ ఇన్ స్పెక్టర్ పై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మరికొంత మందిపై కూడా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

తర్వాత అదే తుపాకీతో తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గాయపడ్డవారిని చికిత్స కోసం ఇంఫాల్ లోని రిమ్స్ కు తరలించారు. కాల్పులకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. అయితే సీఆర్ పీఎఫ్ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

ALSO READ | President Rule: కేంద్రం సంచలన నిర్ణయం.. మణిపూర్లో రాష్ట్రపతి పాలన