జాబ్ నోటిఫికేషన్స్​: సీఆర్‌‌‌‌పీఎఫ్‌‌‌‌లో సబ్ ఇన్‌‌‌‌స్పెక్టర్స్​

జాబ్ నోటిఫికేషన్స్​: సీఆర్‌‌‌‌పీఎఫ్‌‌‌‌లో  సబ్ ఇన్‌‌‌‌స్పెక్టర్స్​

ఎన్​ఐఆర్​డీలో కాంట్రాక్ట్ జాబ్స్​ 

హైదరాబాద్‌‌‌‌ రాజేంద్రనగర్‌‌‌‌లోని నేషనల్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌‌‌‌మెంట్ అండ్‌‌‌‌ పంచాయితీ రాజ్ (నిర్డ్‌‌‌‌ పీఆర్‌‌‌‌) కాంట్రాక్ట్​ ప్రాతిపదికన 141 యంగ్ ఫెలో ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది.

అర్హత: పీజీతో పాటు పీజీ డిప్లొమా(సోషల్‌‌‌‌ సైన్సెస్‌‌‌‌) ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ప్రావీణ్యం, కంప్యూటర్‌‌‌‌ నాలెడ్జ్​ కలిగి ఉండాలి. వయసు 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది. మే 8 వరకు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి. పూర్తి సమాచారం కోసం www.nirdpr.in వెబ్​సైట్​లో సంప్రదించాలి. 


షార్‌‌‌‌లో టెక్నీషియన్ పోస్టులు 

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్‌‌‌‌) వివిధ విభాగాల్లో టెక్నీషియన్, టెక్నీషియన్ అసిస్టెంట్ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్‌‌‌‌ను విడుదల చేసింది. 

పోస్టులు: మొత్తం 94 ఉద్యోగాల్లో టెక్నీషియన్ అసిస్టెంట్12, లైబ్రరీ అసిస్టెంట్-ఎ 2, సైంటిఫిక్ అసిస్టెంట్ 6, టెక్నీషియన్-బి/ డ్రాఫ్ట్స్‌‌‌‌మ్యాన్-బి 74 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ/ ఎన్‌‌‌‌టీసీ/ ఎన్‌‌‌‌ఏసీ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 నుంచి 35 సంవత్సరాలు ఉండాలి. 

సెలెక్షన్​ ప్రాసెస్​: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆన్​లైన్​లో మే 16 వరకు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు www.shar.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి. 

బార్క్​లో 4374 ఉద్యోగాలు 

బాబా అటామిక్​ రీసెర్చ్​ సెంటర్​(బార్క్‌‌‌‌) డైరెక్ట్‌‌‌‌ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌/ట్రైనింగ్‌‌‌‌ స్కీమ్‌‌‌‌ ద్వారా డీఏఈ విభాగాల్లో 4374 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది.

విభాగాలు: బయోసైన్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఆర్కిటెక్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్‌‌‌‌ సైన్స్, డ్రిల్లింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌‌‌‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జీ, మైనింగ్‌‌‌‌ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. డైరెక్ట్‌‌‌‌ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ ద్వారా  టెక్నికల్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌/సి-181, సైంటిఫిక్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌/బి-07, టెక్నీషియన్‌‌‌‌/బి-24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఎల్‌‌‌‌ఐఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు పోస్టును బట్టి 18 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి. 

సెలెక్షన్​: పోస్టును అనుసరించి ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌‌‌‌డ్‌‌‌‌ టెస్ట్, స్కిల్‌‌‌‌ టెస్ట్, ఇంట­ర్వ్యూ, డాక్యుమెంట్‌‌‌‌ వెరిఫికేషన్, మెడికల్‌‌‌‌ ఎగ్జామినేషన్‌‌‌‌ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. మే 22 వరకు అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.barc.gov.in వెబ్​సైట్​ సంప్రదించాలి. 

సీఆర్‌‌‌‌పీఎఫ్‌‌‌‌లో  సబ్ ఇన్‌‌‌‌స్పెక్టర్స్​ 

డైరెక్టరేట్ జనరల్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్​  గ్రూప్ బి, సి (నాన్ మినిస్టీరియల్, నాన్ గెజిటెడ్, కంబాటైజ్డ్ సిగ్నల్ స్టాఫ్) కేటగిరీలో 212 ఎస్సై, ఏఎస్సై ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌‌‌‌ రిలీజ్​ చేసింది.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్‌‌‌‌, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. వయసు 30 ఏండ్ల లోపు ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్/ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆన్​లైన్​లో మే 21 వరకు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు www.crpf.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి. 

రిజర్వ్ బ్యాంక్​లో ఆఫీసర్​ జాబ్స్​ 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్‌‌‌‌ బోర్డ్​ దేశవ్యాప్తంగా ఆర్‌‌‌‌బీఐ శాఖల్లో ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టుల భర్తీకి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ అప్లికేషన్స్​ కోరుతోంది.

పోస్టులు: ఆఫీసర్ గ్రేడ్ -బి (డీఆర్)- జనరల్ 222, ఆఫీసర్ ఇన్ గ్రేడ్-బి (డీఆర్)- డీఈపీఆర్ 38, ఆఫీసర్ ఇన్ గ్రేడ్-బి (డీఆర్)- డీఎస్‌‌‌‌ఐఎం 31పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

సెలెక్షన్​: ఆన్‌‌‌‌లైన్ పరీక్ష (ఫేజ్ 1, 2), ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు  ఆన్​లైన్​లో మే 9 నుంచి జూన్​ 9 వరకు దరఖాస్తు చేసుకోవాలి.  పూర్తి వివరాలకు www.rbi.org.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.