
మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీఆర్ పీఎఫ్ స్కూల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా సీఆర్ఫీఎఫ్ స్కూళ్లకు మెయిల్ ద్వారా బాంబ్ బెదిరింపు రావడంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. దీంతో సీఆర్ పీఎఫ్ స్కూళ్లలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు.
స్కూల్ లో బాంబ్ పెట్టామని ఓ అగంతకుడి నుంచి ఈ మెయిల్ వచ్చిందన్నారు పోలీసులు. దీంతో జవహర్ నగర్ సీఆర్ పీఎఫ్ స్కూల్ కు చేరుకున్న రాచకొండ సీపీ సుధీర్ బాబు,పోలీసులు విద్యార్థులను బయటకు పంపి తనిఖీలు చేశారు.. అనంతరం బాంబ్ లేదని నిర్ధారించుకున్నారు.