న్యూఢిల్లీ: మహా కుంభమేళాలో జరిగిన తొక్కి సలాట ఘటనపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కుంభ మేళా తొక్కిసలాట ఘటనను ‘దురదృష్టకర ఘటన’గా అభివర్ణించిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సుప్రీంకోర్టు సూచింది.
మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేసేందుకు లక్షలాది మంది భక్తులు పోటెత్తడంతో బుధవారం (2025, జనవరి 29) తెల్లవారుజామున మహాకుంభ్‌లోని సంగం ప్రాంతంలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనలో 30 మంది భక్తులు మరణించగా.. మరో 60 గాయపడ్డట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలో కుంభమేళా తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని.. అలాగే భక్తుల కోసం భద్రతా చర్యలు చేపట్టేలా మార్గదర్శకాలు రూపాందించాలని యూపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్‌పై సోమవారం (ఫిబ్రవరి 3) విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు అంగీకరించలేదు. విచారణ సందర్భంగా ఈ తొక్కిసలాట ఘటనను అనుకోకుండా జరిగిన దురదృష్టకర ఘటనగా పేర్కొంది. అలాగే.. అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది సుప్రీంకోర్టు.