
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మెయిన్ రోడ్ల మధ్యలో లక్షలాది రూపాయలతో నిర్మించిన డివైడర్లు కూలిపోతున్నాయి. వీటిని 2, 3 ఏండ్ల క్రితం నిర్మించారు. సిరిసిల్లా రోడ్డు, నిజాంసాగర్ చౌరస్తా నుంచి దేవునిపల్లి శివారు వరకు, టెక్రియాల్ చౌరస్తా నుంచి నర్సన్నపల్లి చౌరస్తా వరకు రోడ్డు మధ్యలో డివైడర్ల నిర్మాణం జరిగింది.
జన్మ భూమి రోడ్డు చౌరస్తా, దేవునిపల్లి శివారులో, సిరిసిల్లా రోడ్డు, సరంపల్లి సమీపంలో పలు చోట్ల డివైడర్లు పగుళ్లు వచ్చి రాళ్లు ఊడిపోయాయి. మున్సిపల్ అధికారులు స్పందించి డివైడర్లకు మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.