కారులో ఉండే డీసీ ఛార్జర్‌తో ఫోన్లను ఛార్జ్ చేసుకోవచ్చు. కానీ.. ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్ ఛార్జ్ చేయాలంటే 12వోల్ట్స్ డీసీ పవర్‌ను 220 వోల్ట్స్ ఏసీగా మార్చాలి. అలా మార్చాలంటే క్రస్ట్ అనే కంపెనీ తీసుకొచ్చిన ఈ పోర్టబుల్ ఇన్వెర్టర్ వాడాలి. దీన్ని 12వోల్ట్స్ డీసీకి కనెక్ట్ చేయాలి. దీనికి 4 యూఎస్బీ పోర్ట్‌లతోపాటు 3 ఏసీ ఔట్‌లెట్లు ఉంటాయి. అంటే ఒకేసారి 7 గాడ్జెట్స్ ఛార్జ్ చేసుకోవచ్చు.
కాకపోతే.. అన్నింటికీ కలిపి 200 వాట్స్ మాత్రమే అందించగలదు. ఇందులో షార్ట్ సర్క్యూట్, ఓవర్ హీటింగ్ ప్రొటెక్షన్ కూడా ఉంది. ఇంటిగ్రేటెడ్ టెంపరేచర్- కంట్రోల్ కూలింగ్ ఫ్యాన్ వల్ల ఇది ఎక్కువగా వేడెక్కదు.
ధర : 1,799 రూపాయలు