ట్రేడింగ్ పేరుతో రూ.2.06 కోట్లు కొట్టేసిన మరో గ్యాంగ్‌లో కోటక్ మహీంద్రా బ్యాంక్ సేల్స్ మేనేజర్ కీలకంగా వ్యవహరించాడు. ఏపీ గుంటూరు జిల్లా జేఎన్‌టీయూలోని కోటక్ మహీంద్రా బ్యాంక్ సేల్స్ మేనేజర్ కాట శ్రీనివాసరావు, వెస్ట్‌గోదావరి జిల్లా వెల్పూరుకు చెందిన రెడ్డి ప్రవీణ్, హైదరాబాద్ షాలిబండకు చెందిన ట్రావెల్స్ ఆపరేటర్ మహ్మద్ ఇస్మాయిల్, బహదూర్‌పురాకు చెందిన క్రిప్టో ట్రేడర్ మహ్మద్ జునైద్, ఏపీ మచిలీపట్నంకు చెందిన మాగంటి జయకిరణ్గ్యాంగ్గా ఏర్పడ్డారు.
మల్టీపుల్ మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేశారు. వీటి ద్వారా సైబర్ నేరగాళ్లు కొట్టేసిన డబ్బు విత్‌డ్రా చేయడంతో పాటు క్రిప్టో కరెన్సీగా మార్చుతున్నారు. ఈ క్రిప్టో కరెన్సీని హవాలా నెట్‌వర్క్ ద్వారా దుబాయ్‌లోని సైబర్ నేరగాళ్లకు అందిస్తున్నారు. పోయినేడాది డిసెంబర్‌లో హైదరాబాద్‌కు చెందిన బాధితుడిని అనీషా ట్రేడింగ్ యాప్ పేరుతో ట్రాప్ చేశారు.
అధిక లాభాలు ఇస్తామంటూ విడతల వారీగా రూ.2.06 కోట్లు కొట్టేశారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా డిసెంబర్ 22న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బ్యాంక్ సేల్స్ మేనేజర్ సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద రూ.47.50 లక్షల నగదు, రూ.40 లక్షలు విలువ చేసే క్రిప్టో కరెన్సీ, 33 చెక్ బుక్స్, 26 డెబిట్ కార్డులు, క్యాష్ కౌంటింగ్ మెషిన్స్ స్వాధీనం చేసుకున్నారు.