క్రిప్టో మార్కెట్​లో మహిళా ఇన్వెస్టర్ల హవా

క్రిప్టో మార్కెట్​లో మహిళా ఇన్వెస్టర్ల హవా

హైదరాబాద్​, వెలుగు: ఇండియా క్రిప్టో మార్కెట్​లో మహిళల భాగస్వామ్యం వేగంగా పెరుగుతోందని, గత జనవరి నుంచి ఈ జనవరి వరకు మహిళా ఇన్వెస్టర్ల సంఖ్య 20 శాతం పెరిగిందని క్రిప్టో ఎక్స్చేంజ్​జియోటస్​ తెలిపింది. మొత్తం ట్రేడింగ్​ వాల్యూమ్​లో వీరి వాటా 15 శాతం ఉంది. మహిళా ఇన్వెస్టర్లు దీర్ఘకాల ఇన్వెస్ట్​మెంట్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. బిట్​కాయిన్​, ఎథేరియమ్​ వంటి క్రిప్టోలను ఎక్కువగా కొంటున్నారు. 

ఫైనాన్స్​ ప్రొడక్టులపై, క్రిప్టోలపై అవగాహన పెరగడమే ఇందుకు కారణం. క్రిప్టోల్లో ఎక్కువగా యువతే పెట్టుబడులు పెడతారనేది అపోహ అని, 36‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలూ ఇన్వెస్ట్​ చేస్తున్నారని జియోటస్​ తెలిపింది. మొత్తం ట్రేడర్లలో వీరి సంఖ్య 32 శాతం వరకు ఉంటుంది. చిన్న నగరాల మహిళలూ క్రిప్టోలపై ఆసక్తి చూపుతున్నారని జియోటస్​ వెల్లడించింది.