- బిట్‌కాయిన్‌కు ఏమైంది!
- నెగెటివ్ వార్తలతో బేర్ గుప్పిట్లోకి బిట్‌కాయిన్, ఎథరమ్, డోజ్‌కాయిన్
- గరిష్టాల నుంచి 50 శాతానికి పైగా డౌన్
బిజినెస్‌డెస్క్, వెలుగు: క్రిప్టో వరల్డ్‌లో బేర్ రన్ నడుస్తోంది. ఫేమస్ క్రిప్టో కరెన్సీలు బిట్‌కాయిన్, ఎథరమ్, డోజ్‌కాయిన్ వంటివి గత కొన్ని నెలల నుంచి డౌన్ ట్రెండ్‌ను చూస్తున్నాయి. ఎలన్ మస్క్ ప్రకటనతో స్టార్టయిన బిట్‌కాయిన్ క్రాష్, ఇంకా ఆగలేదు. రికార్డ్ స్థాయిల నుంచి బిట్‌కాయిన్ 50 శాతానికి పైగా నష్టపోయి 31 వేల డాలర్లను టచ్ చేసింది. ఎథరమ్ 57 శాతం పతనమై 1,800 డాలర్లకు పడింది. గత ఏడాది కాలంలో ఎథరమ్ 1,150 శాతం లాభపడింది. అమెరికన్ పాపులర్ షో ‘శాటర్ డే నైట్’ లో డోజ్ కాయిన్ ఫ్రాడ్ అని మస్క్ చేసిన ప్రకటనతో ఈ క్రిప్టో పతనం స్టార్టయ్యింది. ప్రస్తుతానికైతే పాపులర్ క్రిప్టోలన్నీ డౌన్ ట్రెండ్‌లో ఉన్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు. వజీర్ ఎక్స్, కాయిన్‌డీసీఎక్స్, కాయిన్‌స్విచ్ కుబేర్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ట్రేడింగ్ వాల్యూమ్స్ కూడా విపరీతంగా తగ్గాయి. మే నెలతో పోలిస్తే జులైలో ట్రేడింగ్ వాల్యూమ్స్ 60 శాతానికి పైగా పడిపోయాయని ఈ ఎక్స్చేంజిలు ప్రకటించాయి. కేవలం ఇండియాలోనే కాదు గ్లోబల్‌గా చూసినా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ తగ్గింది.
క్రిప్టో కరెన్సీలు ఎందుకు పడుతున్నాయంటే!
బిట్‌కాయిన్ పేమెంట్లను టెస్లా అనుమతించదని ఈ ఏడాది మే లో మస్క్ చేసిన ప్రకటన మొత్తం క్రిప్టో వరల్డ్‌ను కదిలించింది. అంతకు ముందు 64,778 డాలర్ల వద్ద బిట్‌కాయిన్ ఆల్‌టైమ్ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఎథరమ్ కూడా 4,366 డాలర్ల వద్ద కొత్త రికార్డ్‌ను టచ్ చేసింది. డోజ్‌కాయిన్ అయితే గత 12 నెలల్లో 13,310% ఎగిసింది. కానీ, ఎన్వీరాన్‌మెంట్‌కు బిట్‌కాయిన్ మైనింగ్ వల్ల హాని జరుగుతోందని, అందుకే వీటి పేమెంట్లను టెస్లా తీసుకోదని మస్క్ ప్రకటించడంతో క్రిప్టో కరెన్సీల పతనం ప్రారంభమయ్యింది. దీనికి తోడు బిట్‌కాయిన్ మైనింగ్‌లో కీలకంగా ఉన్న చైనా కూడా క్రిప్టో కరెన్సీలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంది. క్రిప్టో పేమెంట్లను చేయకూడదని ఆ దేశంలోని ఫైనాన్షియల్ సంస్థలను ఆదేశించింది. కిందటి నెలలో అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బిట్‌కాయిన్ ఒక స్కామ్ అని పేర్కొన్నారు. దీంతో ఆ రోజు బిట్‌కాయిన్ 10 శాతం నష్టపోయింది. మరోవైపు అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజి బైనాన్స్‌ను బ్రిటన్ బ్యాన్ చేయడం, జపాన్, థాయ్‌లాండ్‌లో కూడా వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటుండడంతో క్రిప్టోలు పడుతున్నాయి. గత ఏడాది కాలంగా విపరీతంగా పెరిగిన క్రిప్టోల్లో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటుండడం కూడా వీటి పతనానికి కారణంగా చెప్పొచ్చు.
ఇప్పుడు ఎంటర్ అవ్వాల్నా? వద్దా?
రికార్డ్ హై నుంచి బిట్‌కాయిన్ 50 శాతం పడింది. ఎథరమ్ 57 శాతం నష్టపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో క్రిప్టోలను కొనాలా? అమ్మాలా? అనే డౌట్ క్రిప్టో ఇన్వెస్టర్లలో నెలకొంది. అసెట్‌గా చూస్తే క్రిప్టోలకు భవిష్యత్ ఉందని ఇండస్ట్రీ ఎక్స్‌పర్టులు అంటున్నారు. ‘క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌లో కదలికలు ఎక్కువగా ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలి. మీడియం టెర్మ్ వరకైనా క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్లను హోల్డ్ చేయాలి’ అని రవి రాజన్ అండ్ కో. మేనేజింగ్ పార్టనర్ ఎస్ రవి అన్నారు. తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలని సలహాయిచ్చారు. ఇన్వెస్టర్ల సామర్ధ్యం బట్టి సిస్టమేటిక్‌గా ఇన్వెస్ట్ చేసుకుంటే కొంత కాలానికి ప్రాఫిట్స్ వస్తాయని పేర్కొన్నారు. కానీ, ఇన్వెస్టర్లకు లాజికల్ థింకింగ్, క్రిప్టోలను నడిపే టెక్నాలజీపై అవగాహన ఉండడం చాలా ముఖ్యమని అన్నారు.