క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం

హైదరాబాద్ కూకట్ పల్లిలో క్రిప్టో కరెన్సీ పేరుతో ఓ కంపెనీ భారీ మోసానికి పాల్పడింది. లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే.. 90 రోజుల్లో 4 లక్షలు ఇస్తామంటూ ఆశ చూపిన XCSPL అనే కంపెనీ కోట్ల రూపాయలు దండుకుంది. మంజీరా మాల్ లో ఉన్న ఈ కంపెనీ మూడు నెలల్లో మీరు పెట్టిన పెట్టుబడికి 4 రేట్లు ఎక్కువ ఇస్తామని పలువురి వద్ద లక్షల రూపాయలు వసూలు చేసింది. బాధితులు అప్పులు చేసి, లోన్ తీసుకుని, క్రెడిట్ కార్డ్ ద్వారా డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. అయితే నెలలు గడిచినా కంపెనీ డబ్బు చెల్లించకపోవడంతో మోసపోయినట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు తమ డబ్బు తమకు ఇప్పించేలా చూడాలని కోరారు.