కొత్త సీఎస్ శాంతికుమారి కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారి ఆమె స్వామి వారిని దర్శించుకున్నారు. సీఎస్ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గోదాదేవి,రంగనాయక స్వామి వారికల్యాణంలో సీఎస్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
1989 బ్యాచ్ కు చెందిన శాంతికుమారి ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఏప్రిల్ 2025 వరకు ఆమె సీఎస్‌గా కొనసాగనున్నారు.. గతంలో శాంతి కుమారి అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, వైద్యారోగ్య శాఖలో కూడా బాధ్యతలు నిర్వర్తించారు. సీఎం కార్యాలయంలో స్పెషల్ ఛేజింగ్ సెల్ లో కూడా ఆమె సేవలు అందించారు.