హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు సీఎస్ శాంతకుమారి. ట్యాంక్ బండ్ పై ఏర్పాట్లను పరిశీలించారు సీఎస్. తెలంగాణ రాష్ట్రం అవతరించి పదేళ్లు పూర్తి చేసుకొని పదకొండో యేట అడుగుపెట్టిందన్నారు. జూన్ 2న సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ పై నిర్వహించే వేడుక్లలో పాల్గొంటారని సీఎస్ చెప్పారు. వేడుకల్లో భాగంగా ట్యాంక్ బండ్ పై ఫుడ్ స్టాల్స్, షాపింగ్ , పిల్లలకు ప్లే జోన్ ఏర్పాటు చేశామన్నారు.
ఉత్సవాల్లో భాగంగా ట్యాంక్ బండ్ పై సాగర తీరాన లేజర్ షో, కళాకారుల ఆట పాట ఉంటాయన్నారు సీఎస్. ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని రకాల ఏర్పాట్లు చేశామని సీఎస్ శాంతకుమారి తెలిపారు.