యాసంగి పంటలకు తగినంత సాగునీరు అందించండి .. కలెక్టర్లకు సీఎస్​ ఆదేశం

యాసంగి పంటలకు తగినంత సాగునీరు అందించండి .. కలెక్టర్లకు సీఎస్​ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో యాసంగి పంటలకు తగినంత సాగు నీరు అందించాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్​ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

 యాసంగి సీజన్ పంట సాగు, రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరు, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిర్మూలనకు చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించారు. యాసంగి పంటలకు తగిన సమయంలో సాగునీరు అందేలా కలెక్టర్లు చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. రాబోయే పది రోజులలో విద్యుత్, నీటి సరఫరాను జాగ్రత్తగా సమన్వయం చేయాలని చెప్పారు.