నెలకోసారి హాస్టళ్లలో నిద్ర చేయాలి

  • కలెక్టర్లకు సీఎస్​ ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు : కలెక్టర్లు నెలకు ఒకసారి హాస్టళ్లలో నిద్ర చేయాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. జిల్లాల్లో రెసిడె న్షియల్ స్కూళ్లు తనిఖీ చేస్తేనే అక్కడి పరిస్థితులు మెరుగుపడతా యన్నారు. హాస్టల్స్, స్కూల్స్ విజిట్ చేయటం, నిద్ర చేసే తేదీల్లో చేపట్టిన చర్యలను డైరీల్లో రాయడం వంటివి ప్రతి నెల కలెక్టర్లు చేపట్టే కార్యక్రమాల్లో ఉండాలని సీఎస్ సూచించారు.