జనవరి 16వ తేదీన మాజీ కేంద్రమంత్రి, దివంగత ఎస్. జైపాల్ రెడ్డి 83వ జయంతిని.... అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎస్ శాంతి కుమారి.
నెక్లెస్ రోడ్ లో జైపాల్ రెడ్డి మెమోరియల్ స్ఫూర్తి స్థల్ లో సంబంధిత శాఖ అధికారులతో ఏర్పాట్లు చేయాలని HMDA కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. శానిటేషన్, పార్కింగ్, ట్రాఫిక్ భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు సీఎస్.
ALSO READ |తెలంగాణ భూ భారతి చట్టానికి గవర్నర్ ఆమోదం
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన దివంగత జైపాల్ రెడ్డి పేరును పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత పథకానికి పెట్టాలని తెలంగాణ కేబినెట్ ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే.