ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుక : సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాంతికుమారి

ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుక : సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాంతికుమారి

కరీంనగర్ టౌన్, వెలుగు: ఇసుక రవాణాను కట్టుదిట్టంగా మానిటరింగ్ చేస్తూ, ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా  ఇసుక అందించేలా చర్యలు తీసుకోవాలని స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ శాంతికుమారి అన్నారు. బుధవారం సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కలెక్టర్ పమేలాసత్పతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ----మానకొండూరు మండలం ఊటూరులో 6,700 మెట్రిక్ టన్నులు, వీణవంక మండలం చల్లూరులో 6,900 మెట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టన్నుల నిల్వలు ఉన్నట్లు తెలిపారు.

ఈ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు నిఘా వ్యవస్థ ఉందన్నారు. ఇప్పటికే రెవెన్యూ, మైన్స్, పోలీస్, రవాణా శాఖల అధికారులు జాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వే చేసినట్లు తెలిపారు. అనుమతి లేకుండా, ఎక్కువ ఇసుక తరలించిన కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ పి.పురుషోత్తం, అసిస్టెంట్ జియాలజిస్ట్ వెంకటేశ్వర్, ఎంవీఐ రవికుమార్, ఏఎంవీఐ హరితయాదవ్ పాల్గొన్నారు.