తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్లు : సీఎస్ శాంతికుమారి

తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్లు : సీఎస్ శాంతికుమారి

రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు సీఎస్ శాంతికుమారి. సీఎం రేవంత్ ఆదేశాలతో రాష్ట్రంలో మహిళా శక్తి-క్యాంటీన్ సర్వీస్ లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. క్యాంటీన్ల ఏర్పాటు పై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు సీఎస్. క్యాంటీన్ల ఏర్పాటుకు స్థలం, పనితీరు, నిర్వహణ,రోడ్ మ్యాప్ సహా పలు అంశాలపై ప్రణాళిక రూపొందించాలని గ్రామీణాభివృద్ధి కమీషనర్ ను ఆదేశించారు సీఎస్.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్టాండ్లు, పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రత్యేకంగా క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు సీఎస్. ఇందుకోసం ఇప్పటికే కేరళలోని అన్న క్యాంటీన్లు, బెంగాల్ లోని దీదీ కా రసోయ్ క్యాంటీన్ల పనితీరుపై అధ్యయనం చేసినట్టు చెప్పారు. రానున్న రెండేళ్లలో కనీసం 150 క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ క్యాంటీన్ల నిర్వహణను గ్రామైక్య సంఘాలకు అప్పగించి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు సీఎస్.