జులై 4న హైదరాబాద్​కు రాష్ట్రపతి ముర్ము.. ఏర్పాట్లపై సీఎస్​ శాంతికుమారి ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జులై 4న హైదరాబాద్ రాను న్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్లను చేయాలని అధికారులను సీఎస్ ​శాంతి కుమారి ఆదేశించారు. సోమవారం సెక్రటేరియెట్‌లో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.

ALSO READ:సిగరెట్ తాగిండని స్టూడెంట్​ను చావబాదిన టీచర్లు.. ట్రీట్మెంట్ పొందుతూ బాలుడు మృతి

డీజీపీ అంజనీకుమార్​తో పాటు పలు శాఖల అధికారులు హాజరయ్యారు. జులై 4 సాయంత్రం అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొంటారని తెలిపారు. ఈ పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రొటోకాల్​ను అనుసరించి  అన్ని శాఖల అధికారులు సమన్వయంతో రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేయాలని సీఎస్​ కోరారు.