ఇంటర్ చదివి ఖాళీగా ఉన్నారా.. మీకే ఈ గోల్డెన్ ఛాన్స్.. వెంటనే ఈ జాబ్ కి అప్లై చేసుకోండి

ఇంటర్ చదివి ఖాళీగా ఉన్నారా.. మీకే ఈ గోల్డెన్ ఛాన్స్.. వెంటనే ఈ జాబ్ కి అప్లై చేసుకోండి

గ్రూప్​–సి నాన్​గెజిటెడ్​ కేటగిరీలో జూనియర్​ సెక్రటేరియట్​ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్​ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని సీఎస్ఐఆర్ – సెంట్రల్ రక్షఢ్​ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్(సీఆర్ఆర్ఐ) అప్లికేషన్లను కోరుతున్నది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్​ 21వ తేదీలోగా ఆన్​లైన్​లో అప్లై చేసుకోవచ్చు. 

  • పోస్టుల సంఖ్య: 209
  • పోస్టులు: జూనియర్ సెక్రటేరియట్​ అసిస్టెంట్​ 177, జూనియర్ ​స్టెనోగ్రాఫర్​ 32. 
  • ఎలిజిబిలిటీ: సంబంధిత విభాగంలో పదోతరగతితోపాటు ఇంటర్మీడియట్​ లేదా 12వ తరగతి లేదా సమాన విద్యార్హతతోపాటు టైపింగ్​ స్కిల్స్, స్టెనోగ్రఫీలో ప్రావీణ్యం ఉండాలి. వయోపరిమితి జూనియర్​ సెక్రటేరియట్​ అసిస్టెంట్ పోస్టుకు 28 ఏండ్లు, జూనియర్ స్టెనోగ్రాఫర్​ పోస్టుకు 27 ఏండ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఐదేండ్లు, ఓబీసీ–ఎన్​సీఎల్​ వారికి మూడేండ్లు, దివ్యాంగులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
  • అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. ఫీజు యూఆర్, ఇతర అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. 
  • లాస్ట్ డేట్: ఏప్రిల్​ 21.
  • సెలెక్షన్​ ప్రాసెస్: రాతపరీక్ష, స్టెనోగ్రఫీ, టైపింగ్​ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.