IPL 2025: ఆ రెండు జట్లకు చావో రేవో.. ఒక్క మ్యాచ్ ఓడినా ఇంటికే

IPL 2025: ఆ రెండు జట్లకు చావో రేవో.. ఒక్క మ్యాచ్ ఓడినా ఇంటికే

ఐపీఎల్ 2025 ప్రారంభమై ఆదివారం (ఏప్రిల్ 20)తో నెల రోజులైంది. అన్ని జట్లు ఇప్పటివరకు సగం మ్యాచ్ లు ఆడేశాయి. ప్లే ఆఫ్ కు వెళ్లే జట్లేవో.. టోర్నీ నుంచి నిష్క్రమించే జట్లేవో క్లారిటీ వచ్చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జయింట్స్ జట్లు ప్లే ఆఫ్ రేస్ లో దూసుకెళ్తున్నాయి. ఢిల్లీ, గుజరాత్ ఆడిన 7 మ్యాచ్ ల్లో 5 మ్యాచ్ లు గెలిస్తే.. బెంగళూరు, పంజాబ్, లక్నో ఆడిన 8 మ్యాచ్ ల్లో 5 మ్యాచ్ లు గెలిచాయి. ఈ ఐదు జట్లు మరో మూడు మ్యాచ్ లు గెలిచినా రాయల్ గా ప్లే ఆఫ్ లోకి అడుగుపెడతాయి. కోల్ కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే తీవ్రంగా శ్రమించాల్సిందే. 

కోల్ కతా మిగిలిన 7 మ్యాచ్ ల్లో 5 విజయాలు సాధించాలి. ఇక ముంబై మిగిలిన 6 మ్యాచ్ ల్లో 4 గెలవాలి. సన్ రైజర్స్ హైదరాబాద్ డేంజర్ జోన్ లో ఉంది. కమ్మిన్స్ సేన ఆడిన 8 మ్యాచ్ ల్లో 3 మాత్రమే గెలిచింది. ఆ జట్టు ప్లే ఆఫ్ కు సాధించాలంటే మిగిలిన 6 మ్యాచ్ ల్లో 5 మ్యాచ్ లు తప్పకుండా గెలిచి తీరాల్సిందే. అన్నిటికంటే దారుణమైన పరిస్థితిలో మాజీ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఉన్నాయి. ఈ రెండు జట్లు కూడా ఆడిన 8 మ్యాచ్ ల్లో కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే గెలిచి టోర్నీ నుంచి నిష్క్రమించే దశలో ఉన్నాయి. 

Also Read:-ఆ ఒక్కడికే అన్యాయం: సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించిన ఐదుగురు క్రికెటర్లు వీరే!

చెన్నై, రాజస్థాన్ మిగిలిన 6 మ్యాచ్ ల్లో తప్పకుండా గెలిస్తేనే ప్లే ఆప్స్ కు చేరతాయి. ఒక్క మ్యాచ్ ఓడిపోయినా ఇంటి దారి పట్టడం ఖాయం. ఈ రెండు జట్లకు ప్రస్తుతం నెట్ రన్ రేట్ కూడా మైనస్ ల్లో ఉంది. దీంతో తర్వాత ఆడబోయే మ్యాచ్ ల్లో భారీగా గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజస్థాన్ గురువారం (ఏప్రిల్ 24) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడాల్సి ఉంది. టోర్నీలో నిలవాలంటే ఈ మ్యాచ్ లో గెలుపు తప్పనిసరి. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ శుక్రవారం (ఏప్రిల్ 25) సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడుతుంది. చెన్నై ఈ మ్యాచ్ లో ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.