ప్రియురాలిని పెళ్లాడిన రుతురాజ్‌ గైక్వాడ్‌.. అంగరంగ వైభవంగా పెళ్లి

 ప్రియురాలిని పెళ్లాడిన రుతురాజ్‌ గైక్వాడ్‌.. అంగరంగ వైభవంగా పెళ్లి

భారత యువ క్రికెటర్ రుతురాజ్‌ గైక్వాడ్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. తన చిరకాల స్నేహితురాలు, మహారాష్ట్ర దేశవాలీ క్రికెటర్‌ ఉత్కర్ష పవార్‌ను పెళ్లాడాడు. ముంబైలోని ఓ పంక్షన్‌ హాల్‌లో వీరి వివాహం జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫోటోలను రుత్‌రాజ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. కాగా వీరిద్దరూ తమ పెళ్లికి ముందు రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. పెండ్లి ఫొటోలు చూసిన సెలబ్రెటీలు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్తున్నారు.

ఐపీఎల్ 2023 సీజన్‌లో రుతురాజ్‌ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరుపున ఆడిన గైక్వాడ్.. 16 మ్యాచుల్లో 590 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక తాను వివాహమాడిన తన ప్రియురాలి విషయానికొస్తే.. పేరు..ఉత్కర్ష పవార్. మహారాష్ట్ర దేశవాలీ మహిళా క్రికెటర్. 1998 అక్టోబర్ 13న మహారాష్ట్రలోని పుణేలో జన్మించిన ఆమె, 11 ఏళ్ల నుంచే క్రికెట్ ఆడటం మొదలుపెట్టింది. కాకుంటే అది 10 మ్యాచులకే పరిమితమైంది. 10 మ్యాచుల్లో ఉత్కర్ష 5 వికెట్లు పడగొట్టింది.

https://twitter.com/mufaddal_vohra/status/1665041791538835457