చెన్నై: ఇంగ్లండ్, చెన్నై సూపర్‌కింగ్స్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్.. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ఆడటం లేదు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్, ఫిట్‌నెస్‌లో భాగంగా అతను మెగా లీగ్‌కు దూరంగా ఉంటున్నట్లు సీఎస్‌కే ఫ్రాంచైజీ గురువారం తెలిపింది. 2023 ఐపీఎల్‌కు ముందు సూపర్‌కింగ్స్‌తో జత కట్టిన స్టోక్స్ మోకాలి గాయం కారణంగా కేవలం రెండు మ్యాచ్‌లే ఆడాడు. రూ. 16.25 కోట్లకు కొనుగోలు చేసిన అతను 15 రన్స్ చేయడంతో పాటు లీగ్ మొత్తంలో ఒకే ఒక్క ఓవర్ బౌలింగ్ చేశాడు.
ఎక్కువ మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితమయ్యాడు. ‘స్టోక్స్ నిర్ణయాన్ని మేం గౌరవిస్తాం. ఐపీఎల్‌కు ముందు ఇంగ్లండ్.. ఇండియాతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. దానిలో పాల్గొన్న వెంటనే ఐపీఎల్ ఆడటం కాస్త కష్టమే. ఇప్పటికే స్టోక్స్‌ను మోకాలి గాయం వేధిస్తున్నది. అందుకే అతను మెగా లీగ్ నుంచి తప్పుకుంటానని చెప్పాడు’ అని సీఎస్‌కే పేర్కొంది. వన్డేలకు ప్రకటించిన రిటైర్మెంట్‌ను పక్కనబెట్టి వరల్డ్ కప్‌లో బరిలోకి దిగిన స్టోక్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.