చెన్నైకి స్పిన్‌‌‌‌ పోటు.. 7 వికెట్లతో సీఎస్కేపై పంజాబ్‌‌‌‌ గెలుపు

చెన్నైకి స్పిన్‌‌‌‌ పోటు.. 7 వికెట్లతో సీఎస్కేపై పంజాబ్‌‌‌‌ గెలుపు
  • రాణించిన రాహుల్ చహర్‌‌‌‌‌‌‌‌, హర్‌‌‌‌‌‌‌‌ప్రీత్

చెన్నై: ఐపీఎల్‌‌‌‌17లో పడుతూ లేస్తూ ముందుకు సాగుతున్న పంజాబ్ కింగ్స్‌‌‌‌ నాలుగో విజయం సాధించింది.   గత మ్యాచ్‌‌లో సన్‌‌రైజర్స్‌‌ను చిత్తు చేసిన చెన్నై సూపర్ కింగ్స్‌‌‌‌ను స్పిన్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌తో దెబ్బకొట్టింది. స్పిన్నర్లు  రాహుల్‌‌‌‌ చహర్‌‌‌‌ (2/16),  హర్‌‌‌‌‌‌‌‌ప్రీత్ బ్రార్ (2/17)‌‌‌‌  సూపర్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌కు తోడు  జానీ బెయిర్‌‌‌‌‌‌‌‌స్టో (30 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 46), రిలీ రొసో (23 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 43) మెరుపులతో బుధవారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో పంజాబ్‌‌‌‌  7 వికెట్ల తేడాతో చెన్నైని ఓడించింది. తొలుత సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 162/7 స్కోరు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (48 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 62) ఫిఫ్టీతో రాణించాడు. అనంతరం పంజాబ్‌‌‌‌ 17.5 ఓవర్లలో 163/3  స్కోరు చేసి గెలిచింది. హర్‌‌‌‌ప్రీత్‌‌కు ప్లేయర్ ఆఫ్  ద మ్యాచ్ అవార్డు లభించింది. 

రుతురాజ్‌‌‌‌ ఫిఫ్టీ.. చహర్,  బ్రార్ కట్టడి 

టాస్‌‌‌‌ ఓడి మొదట బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన సీఎస్కేకు ఓపెనర్లు రుతురాజ్‌‌‌‌, అజింక్యా రహానె (29) మంచి ఆరంభమే ఇచ్చినా మధ్యలో తడబడిన ఆతిథ్య జట్టు సాధారణ స్కోరుకే పరిమితం అయింది. తొలి ఓవర్లో రబాడ నాలుగే రన్స్‌‌‌‌ ఇవ్వగా.. అర్ష్‌‌‌‌దీప్ వేసిన రెండో ఓవర్లో రుతురాజ్‌‌‌‌ రెండు ఫోర్లతో బ్యాట్ ఝుళిపించాడు. అర్ష్‌‌‌‌దీప్ బౌలింగ్‌‌‌‌లోనే అతను మరో రెండు ఫోర్లు రాబట్టగా.. కరన్‌‌‌‌ ఓవర్లో రహానె హ్యాట్రిక్ ఫోర్లతో అలరించాడు.

దాంతో పవర్‌‌‌‌‌‌‌‌ప్లేలో సీఎస్కే 55/0తో నిలిచింది. కానీ, ఫీల్డింగ్ మారి స్పిన్నర్లు హర్‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌, రాహుల్ చహర్ బరిలోకి వచ్చాక పరిస్థితి మారింది. తొమ్మిదో ఓవర్లో బ్రార్ వరుస బాల్స్‌‌‌‌లో రహానె, దూబే (0)ను ఔట్‌‌‌‌ చేసి హోమ్‌‌‌‌టీమ్‌‌‌‌కు షాకిచ్చాడు. ఆ వెంటనే జడేజా (2)ను చహర్‌‌‌‌‌‌‌‌ ఎల్బీ చేయడంతో సగం ఓవర్లకు సీఎస్కే 71/3తో నిలిచింది. స్లో వికెట్‌‌‌‌పై బ్రార్, చహర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దాంతో రుతురాజ్‌‌‌‌, యంగ్ హిట్టర్ సమీర్ రిజ్వీ (21)  వరుసగా తొమ్మిది ఓవర్ల పాటు ఒక్క బౌండ్రీ కూడా కొట్టలేదు. ఈ  ఇద్దరూ సింగిల్స్‌‌‌‌, డబుల్స్‌‌‌‌తో 15 ఓవర్లకు స్కోరు వంద దాటించారు.  

రబాడ బౌలింగ్‌‌‌‌లో ఫోర్‌‌‌‌‌‌‌‌తో వేగం పెంచే ప్రయత్నం చేసిన రిజ్వీ తర్వాతి బాల్‌‌‌‌కే హర్షల్‌‌‌‌కు క్యాచ్ ఇవ్వడంతో నాలుగో వికెట్‌‌‌‌కు37 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. అయితే కరన్‌‌‌‌ వేసిన 17వ ఓవర్లో గైక్వాడ్‌‌‌‌ 4, 6, 6తో గేరు మార్చాడు. ఈ క్రమంలో 44 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో మొయిన్ అలీ (15) 6, 4 కొట్టడంతో సీఎస్కే మంచి స్కోరు చేసేలా కనిపించింది. 

కానీ,  అదే ఓవర్లో రుతురాజ్ బౌల్డ్‌‌‌‌ అవగా.. 19వ ఓవర్లో అలీని బౌల్డ్‌‌‌‌ చేసిన చహర్ మూడు రన్సే ఇచ్చాడు. అర్ష్‌‌‌‌దీప్ వేసిన చివరి ఓవర్లో 4,6 కొట్టి  స్కోరు 160 దాటించిన ధోనీ (14) లాస్ట్ బాల్‌‌‌‌కు రనౌటయ్యాడు. ఈ సీజన్‌‌‌‌లో వరుసగా ఏడు ఇన్నింగ్స్‌‌‌‌ల్లో నాటౌట్‌‌‌‌గా నిలిచిన మహీ తొలిసారి ఔటవడం గమనార్హం. 

బెయిర్‌‌‌‌‌‌‌‌స్టో, రొసో దూకుడు

ఛేజింగ్‌‌‌‌లో పంజాబ్ కింగ్స్ దూకుడుగా ఆడింది. ఓపెనర్ ప్రభ్‌‌‌‌సిమ్రన్‌‌‌‌ (13) తొలి ఓవర్లోనే 4, 6తో దీపక్ చహర్‌‌‌‌‌‌‌‌కు స్వాగతం పలికాడు. రెండో ఓవర్లో బెయిర్‌‌‌‌‌‌‌‌స్టో బౌండ్రీల ఖాతా తెరిచాడు. నాలుగో ఓవర్లో ప్రభ్‌‌‌‌సిమ్రన్‌‌‌‌ను రిచర్డ్ గ్లీసన్‌‌‌‌ ఔట్‌‌‌‌ చేయగా.. వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో వచ్చిన రిలీ రోసోతో కలిసి బెయిర్‌‌‌‌‌‌‌‌స్టో ఇన్నింగ్స్‌‌‌‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఎదుర్కొన్న తొలి రెండు బాల్స్‌‌‌‌ను బౌండ్రీకి చేర్చిన రొసో దూకుడుగా బ్యాటింగ్‌‌‌‌ చేశాడు. ముస్తాఫిజుర్ బౌలింగ్‌‌‌‌లోనూ వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. మరో ఎండ్‌‌లో  బెయిర్‌‌‌‌‌‌‌‌స్టో సైతం వేగం పెంచాడు.

శార్దూల్, జడేజా ఓవర్లలో రెండేసి ఫోర్లతో ఆకట్టుకున్నాడు. మొయిన్ అలీ బౌలింగ్‌‌‌‌లో 6, 4తో జోరందుకున్నాడు. అయితే ఈ సీజన్‌‌‌‌లో తొలిసారి బౌలింగ్‌‌‌‌కు వచ్చిన శివం దూబే తన రెండో బాల్‌‌‌‌కే బెయిర్‌‌‌‌‌‌‌‌స్టోను ఔట్‌‌‌‌ చేసి రెండో వికెట్‌‌‌‌కు 67 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ బ్రేక్ చేశాడు. అదే ఓవర్లో 6, 4 రాబట్టిన రొసో.. శార్దూల్ వేసిన12వ ఓవర్లో భారీ సిక్స్‌‌‌‌తో స్కోరు వంద దాటించాడు. అదే ఓవర్లో ఫుల్ టాస్‌‌‌‌ బాల్‌‌‌‌తో రొసోను శార్దూల్ బౌల్డ్ చేశాడు. అప్పటికే మ్యాచ్‌‌‌‌ పంజాబ్‌‌‌‌ చేతుల్లోకి వచ్చేసింది. విజయానికి 48 బాల్స్‌‌‌‌లో 50 రన్స్‌‌‌‌ అవసరం అవగా.. శశాంక్‌‌‌‌ (25 నాటౌట్‌‌‌‌),కెప్టెన్ సామ్ కరన్ (26 నాటౌట్‌‌‌‌) టార్గెట్‌‌‌‌ను కరిగించారు. నాలుగో వికెట్‌‌‌‌కు అజేయంగా 50 రన్స్ జోడించి 13 బాల్స్‌‌‌‌ మిగిలుండగానే జట్టును గెలిపించారు. 

సంక్షిప్త స్కోర్లు


చెన్నై: 20 ఓవర్లలో 162/7 (రుతురాజ్ 62, రహానె 29, రాహుల్ చహర్ 2/16, హర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్ బ్రార్ 2/17). 
పంజాబ్: 17.5 ఓవర్లలో 163/3 (బెయిర్‌‌‌‌‌‌‌‌స్టో 46, రొసో 43, దూబే 1/14)