చెన్నై సూపర్ కింగ్సే గెలుస్తుందంట..ఇవే కారణాలు

చెన్నై సూపర్ కింగ్సే  గెలుస్తుందంట..ఇవే కారణాలు

ఐపీఎల్ 2023లో  కీలక పోరుకు రంగం సిద్దమైంది. చెన్నైలోని చేపాక్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈమ్యాచ్ లో చెన్నై ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. సొంత గ్రౌండ్ కావడంతో చెన్నైయే గెలుస్తుందని క్రికెట్ విశ్లేకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు కొన్ని కారణాలు కూడా చెప్తున్నారు. 
 

చెన్నై జట్టు విజయానికి కారణాలివే..

ఐపీఎల్ లో నిలకడైన జట్టుగా పేరొందిన  చెన్నై ..ఈ సీజన్లోనూ అలాగే ఆడుతోంది. తమపై మేనేజ్ మెంట్ పెట్టుకున్న నమ్మకానికి ఆటగాళ్లు న్యాయం చేస్తున్నారు. తమకు అప్పగించిన పాత్రలను సరిగ్గా పోషిస్తూ..జట్టును గెలిపిస్తున్నారు. ఈ మ్యాచులోనూ అదే తీరుతో ఆడితే చెన్నై ఈజీగా గెలుస్తుందని చెప్తున్నారు.

ఓపెనర్లు అదుర్స్..

ఐపీఎల్‌2023లో బెస్ట్ ఓపెనింగ్ జోడీగా పేరొందింది  రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే జంట. అద్బుతమైన ఆటతీరు..విభిన్నమైన టెక్నిక్‌తో చెన్నైకు మంచి ఆరంభాలు ఇస్తూ వస్తున్నారు. ఈ సీజన్‌లో డివాన్ కాన్వే 53.18 సగటు, 138.62 స్ట్రైక్ రేటుతో 585 పరుగులు సాధించాడు. రుతురాజ్
గైక్వాడ్   42 సగటు, 148.23 స్ట్రైక్ రేటుతో 504 రన్స్ కొట్టాడు. వీరిద్దరూ మరోసారి చెలరేగితే గుజరాత్‌కు చుక్కలే. 

సొంతమైదానం బలం..

ఈ మ్యాచ్ చెన్నై సొంత మైదానంలో ఆడనుండటం ఆ జట్టుకు మరో ప్లస్. ఈ పిచ్  స్పిన్‌కు సహకరిస్తుంది. దీంతో ఇక్కడ చెన్నై జట్టుకు మెరుగైన గణాంకాలున్నాయి. చేపాక్‌లో చెన్నైని ఓడించడం గుజరాత్ కు అంత ఈజీ కాదు. ఇప్పటి వరకు ఇక్కడ చెన్నై  67 మ్యాచులు ఆడితే 45 మ్యాచుల్లో గెలిచింది. దీంతో చెన్నై జట్టును చెన్నైలో ఓడించడం  గుజరాత్‌కు కత్తిమీద సామే. 

ఇవి కూడా బలాలే..

మిడిలార్డర్ లో  అజింక్య రహానె  డేంజరస్‌గా మారాడు. శివమ్‌ దూబె  కాన్ఫిడెంట్‌ బ్యాటింగ్ జట్టుకు బలం. ఇక వీరితో పాటు..జట్టుకు ధోనీ, జడేజా అండ అతిపెద్ద ప్లస్. అటు బౌలింగ్‌ పరంగా చూస్తే  తుషార్‌ దేశ్‌పాండే లయ అందుకోవడం మంచి పరిణామం. డెత్ ఓవర్లలో  మతీశ పతిరణను ఎదుర్కోవడం చాలా కష్టం.