
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్ తోనే బోణీ కొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగి రాయల్ ఛాలెంజర్స్ పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మంచి జోష్ లో ఉన్న చెన్నై ఆటగాళ్లు థియేటర్‌లో సినిమా చూస్తూ కనిపించారు. విజయం సాధించిన ఒక రోజు తర్వాత అనగా మార్చి 23న MS ధోని,CSK సహచరులు సత్యం థియేటర్‌లో కనిపించి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు.
చెన్నై ఆటగాళ్లను, ముఖ్యంగా ఎంఎస్ ధోనీని చూడటానికి అభిమానులు థియేటర్ బయట ఎదురు చూస్తూ ఉన్నారు. థలా అంటూ ధోనీ కోసం నినాదాలు చేశారు. మైదానంలోనే కాదు థియేటర్ లోనూ ధోనీ క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. ఇటీవలే చెన్నై కెప్టెన్సీ బాధ్యతల నుండి వైదొలిగిన మహేంద్రుడు..ఈ సీజన్ తో రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే వార్తలు వస్తున్నాయి. గైక్వాడ్ ధోనీ స్థానంలో చెన్నై జట్టును నడిపిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తన తదుపరి మ్యాచ్ ను మార్చి 26న గుజరాత్ టైటాన్స్ తో తలపడుతుంది.
[Watch] MS Dhoni watches a movie in Chennai with his CSK teammates https://t.co/rDuy3NUNGr #TeamIndia #ICCWC23 #ICCCRICKETWORLDCUP
— Sports Worldwide (@Sportsworld0412) March 24, 2024