గుజరాత్‌ vs చెన్నై .. ఫైనల్ చేరే జట్టేది?

గుజరాత్‌ vs  చెన్నై .. ఫైనల్ చేరే జట్టేది?


ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-–16 చివరి అంకానికి చేరుకుంది. 2023 మే 23 మంగళవారం రోజున  జరిగే క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–1లో డిఫెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైటాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో.. చెన్నై సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమీతుమీ తేల్చుకోనుంది. ఇందులో గెలిచిన టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండటంతో ఇరుజట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. చెన్నైలోని చెపాక్ స్టేడియం ఈ రసవత్తర పోరుకు వేదికగా మారనుంది.   లీగ్ దశలో మొత్తం 14 మ్యాచ్ లలో 10 మ్యాచ్ లలో గెలిచిన  గుజరాత్ ఏకంగా 20 పాయింట్లతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక  చెన్నై 17 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.  ఇరు జట్లు అద్భుతుమైన ఫామ్లో ఉండటంతో  ఈ రెండు జట్ల మధ్య జరిగే మొదటి క్వాలిఫైయర్‌పై చాలానే అంచనాలు ఉన్నాయి.

గైక్వాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డేవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాన్వే ఇచ్చే శుభారంభంపై  భారీ స్కోరు

ఇక బలబలాలను  ఒకసారి చూసుకుంటే ఇరు జట్లకు  ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాగా కలిసి వస్తోంది. చెన్నైకు రుతురాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డేవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాన్వే ఇచ్చే శుభారంభంపై  భారీ స్కోరు ఆధారపడి ఉంది. వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అజింక్యా రహానె ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షో కోసం ఎదురుచూస్తున్నాడు. మిడిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శివమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దూబే, మొయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలీ, అంబటి రాయుడు మెరుపులు మెరిపిస్తే ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చెన్నై విజయం నల్లేరుమీద నడకే. అయితే అలీ, రాయుడు ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ ఇద్దరిలో ఒకర్ని ఇంపాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉపయోగించుకోనున్నారు. గాయంతో ధోనీ సరైన స్థాయిలో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయలేకపోవడం లోటుగా కనిపిస్తున్నది. ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జడేజా మరోసారి కీలకం కానున్నాడు. పేసర్లుగా దీపక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మహీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీక్షణ, తుషార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాండేను తీసుకోవచ్చు. చెపాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెమ్మదిగా ఉండటంతో స్పిన్నర్లుగా జడేజా, అలీతో పాటు మతీషా పతిరణకు చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దక్కొచ్చు. ఒకవేళ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బట్టి పతిరణను ఇంపాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కూడా వాడుకోవచ్చు. ఓవరాల్​గా ఈ మ్యాచ్​లో 200లకు పైగా టార్గెట్​ను నిర్దేశిస్తేనే గెలుపుపై ఆశలు ఉంటాయి. 

సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శుభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

ఇక గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌ విషయానికి వస్తే ఆ జట్టు ఓపెనర్  శుభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరుసగా రెండు సెంచరీలు చేసి  సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాడు.  అతనికి తోడు మరో ఓపెనర్ సాహా రాణిస్తే గుజరాత్ భారీ స్కోర్ సాధించే అవకాశం ఉంది. గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇంపాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వాడుకునే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది. ఇక గతేడాది దుమ్మురేపిన రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెవాటియా ఈసారి వెనకబడిపోయాడు. ఫినిషర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అతను ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అత్యంత కీలకం కానున్నాడు. హార్దిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాండ్యా కూడా అండగా నిలిస్తే జీటీ విజయం మరింత ఈజీ కానుంది. స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రషీద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్​లోనూ రాణిస్తుండటం కలిసొచ్చే అంశం.  పేసర్లు మహ్మద్​ షమీ, మోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రభావం చూపిస్తే చెన్నై జట్టును తక్కువ స్కోరుకు కట్టడి చేయొచ్చు. 

గతేడాది గుజరాత్ టైటాన్స్ ఈ లీగ్‌లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఈ రెండు జట్లు తలపడినప్పుడు ఒక్కసారి కూడా చెన్నై గెలవలేదు. మరి క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–1లో ఆ జట్టను ఓడిస్తుందో చూడాలి. ఇక చెన్నైని ఈ మ్యాచ్ లో తక్కువ అంచనా వేయలేం.  ఎందుకంటే ఆ  టీమ్ కు  కెప్టెన్ ధోనీనే పెద్ద బలం. ఆ జట్టను ఎలాంటి పరిస్థితి నుంచైనా గెలిపించే వ్యూహాలు వేయడంలో  అతను చాలా స్పెషలిస్ట్  మరి ఈ మ్యాచ్ లో  ధోనీ..  తన అనుభవాన్ని గుజరాత్‌పై ఎలా ఉపయోగిస్తాడో చూడాలి.