చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు తడబడుతున్నారు. స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా దెబ్బకు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. జడేజా 8 బంతుల్లోనే(1.2 ఓవర్లు) 3 కీలక వికెట్లు పడగొట్టాడు. దీంతో కేకేఆర్ 64 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్‌కతాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి బంతికే డేంజరస్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(0) వెనుదిరిగాడు. దేశ్‌పాండే ఓవర్లో జడేజా చేతికి పెవిలియన్ చేరాడు. ఆ సమయంలో అంగ్క్రిష్ రఘువంశీ(24; 18 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్)తో జత కలిసిన నరైన్(27; 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 56 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతోన్న ఈ జోడీని జడేజా విడగొట్టాడు. 7వ ఓవర్ తొలి బంతికే రఘువంశీని ఔట్ చేశాడు. అదే ఓవర్ ఆఖరి బంతికి ప్రమాదకర నరైన్‌ను పెవిలియన్ బాట పట్టించాడు. ఆపై తన తదుపరి ఓవర్‌లో వెంకటేష్ అయ్యర్(3)ను ఔట్ చేసి కోల్‌కతాను కష్టాల్లోకి నెట్టాడు.
RAVINDRA JADEJA HAS PICKED 3 WICKETS IN 8 BALLS ...!!!! 🥶 pic.twitter.com/fj69oQ5TcH
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 8, 2024
ప్రస్తుతం కోల్‌కతా స్కోర్.. 9 ఓవర్లు ముగిసేసరికి 66/4. రమణదీప్ సింగ్(2*), శ్రేయాస్ అయ్యర్(3*) క్రీజులో ఉన్నారు.